జ్వాలా వారధి న్యూస్ ఆగస్టు 24 ములకలపల్లి మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఎం నాగేశ్వరరావు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం లోని ములకలపల్లి మండలంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ విస్తృతంగా పర్యటించారు
ఈక్రమంలో ముందుగా పాత గుండాలపాడు గ్రామపంచాయతీ పరిధిలో ఆరు కోట్ల రూపాయలతో నిర్మించనున్న బీటీ రహదారి పనులకు పన్నెండు లక్షల రూపాయలతో నిర్మించనున్న సీసీ రహదారి పనులకు శంకుస్థాపన చేశారు అనంతరం ఇరవై లక్షల రూపాయలతో నిర్మించిన గ్రామపంచాయతీ నూతన భవనాన్ని ప్రారంభించారు ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం చేపట్టి మండల కేంద్రాలలోని ప్రభుత్వ కార్యాలయాల వద్ద ప్రజా సమస్యల పరిష్కార వేదికలను ఏర్పాటు చేసిన తరుణంలో ప్రజలు అధికారుల చుట్టూ తిరగకుండా అధికారులే ప్రజల వద్దకు వెళ్లేలా పాతగుండాలపాడు గ్రామపంచాయతీ పరిధిలోని వివిధ గ్రామాల ప్రజలు మండల ఉన్నతాధికారులతో కలిసి రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు
ప్రజలు తమ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను నేరుగా వేదిక దృష్టికి తీసుకువచ్చారు పోడుభూములు ఇందిరమ్మ ఇండ్లు తాగునీరు రహదారులు విద్యుత్ విద్య వైద్యం పారిశుద్ధ్యం ప్రభుత్వ సంక్షేమ పథకాలు తదితర అంశాలకు సంబంధించిన సమస్యలను ప్రజలు వివరించారు తమ సమస్యలను నేరుగా ఎమ్మెల్యే గారి దృష్టికి అధికారుల దృష్టికి తీసుకువచ్చేలా రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రత్యేకంగా ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఏర్పాటు చేయడం ద్వారా నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు ప్రజల వద్దకు అధికారులు ప్రజాప్రతినిధులు వెళ్లి సమస్యలను తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కారానికి మార్గం చూపే విధంగా రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల స్

