జ్వాల వారధి న్యూస్ 24 ఆగస్టు 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జ్ జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్
జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టర్ తమరి దృష్టికి తీసుకొని న్యాయం చేయాలని అభ్యర్థన
ఉద్దేశపూర్వకంగానే ఒకరిపై మరొకరు చెప్పుకోవడం సరి కాదని బాధితుడు ఆవేదన
రాజోలి మండల రెవెన్యూ కార్యాలయంలోని అధికారులు నిర్లక్ష్యం వీడి బాధితులకు ప్రజలకు ప్రభుత్వ పరంగా సేవలు అందించాల్సిన వారే ప్రజలను బాధితులను ఇబ్బందులకు గురిచేయడం అనేది చాలా వరకు ప్రభుత్వ విధులను దిక్కరించినట్టే అవుతుంది. మరి గత నెల క్రితం ఇచ్చిన ఫైల్ ను మటు మాయం చేసి, ఒకరి పై మరొకరు చెప్పుకోవడం చాలా వరకు హేయమైనచర్య ఆలస్యం చేసేది వారే ఎందుకు లేటు అయ్యింది అనేది వారే ప్రజలను,బాధితులను పలు ప్రశ్నలతో కాలక్షేపం చేయడంతో బాధితులు తీర్వ ఇబ్బందులకు గురవుతూ విలువైన తమ భూములను కోల్పోయే ప్రమాదంలో పడుతున్నారు.జిల్లాల వారిగా నిర్వహించే ప్రజా వాణి ని మండలాలకు విస్తరింపజేసినా మండల స్థాయి అధికాలుల నిర్లక్ష్యం వలన కాలక్షేపం తప్ప పనులు జరగవు అనేది వాస్తవం ఇందుకు నిలువెత్తు సాక్ష్యం రాజోలి మండల రెవెన్యూ అధికారులు భూ భారతి ఫైల్ మటు మాయం చేయడమే ఒక రెవెన్యూ కార్యాలయంలో ఫైల్ పోయింది అని చెప్పడం సిగ్గు చేటు జోగులాంబ గద్వాల జిల్లా మెజిస్ట్రెట్ మహ రాజ వారు అయిన కలెక్టర్ మాకు న్యాయం చేయాలని అభ్యర్థన చేస్తున్నాము.
