Homeతెలంగాణటైటిల్ : బిఆర్ఎస్ లో చేరిన 50కుటుంబాలు.

టైటిల్ : బిఆర్ఎస్ లో చేరిన 50కుటుంబాలు.

  • బిఆర్ఎస్ పార్టీలో చేరిన 50 కుటుంబాలు.
  • పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే మెచ్చా.
  • అబద్ధపు హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
  • వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమే.. కాబోయే సీఎం కేసీఆర్.
  • పార్టీలకు అతీతంగా పోడు భూములకు పట్టాలు ఇచ్చాం.
  • కాంగ్రెస్ పార్టీ 2 పంటలకు రైతుబంధు ఇచ్చి 4 పంటలకు ఎగొట్టింది. జ్వాలా వారధి న్యూస్ ఆగస్టు 9 అశ్వరావుపేట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఎం నాగేశ్వరరావు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. అశ్వారావుపేట మండలం, కొత్తకావడిగుండ్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సహా పలు పార్టీల నుండి 50 కుటుంబాలు బిఆర్ఎస్ పార్టీలో చేరాయి..పార్టీ మారిన వారికి అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు పార్టీ కండువా కప్పి పార్టీలోకి
ఆహ్వానించారు. పార్టీలో చేరికల సందర్భంగా మెచ్చా నాగేశ్వరావు మాట్లాడుతూ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అశ్వారావుపేట నియోజకవర్గంలో 25వేల ఎకరాలు పోడు పట్టాల తోపాటు 5వేల రూపాయల చొప్పున రైతుబంధు అదనంగా ఇచ్చారని గుర్తుచేశారు. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. సమస్యలపై స్పందించి ప్రశ్నించినవారిపై కేసులు పెట్టీ ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అప్పటివరకు అందరినీ కడుపులో పెట్టీ కాపాడుకుంటామని బరోసా కల్పించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments