Homeఆంధ్రప్రదేశ్33% మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళల వాటా తేల్చండని పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం...

33% మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళల వాటా తేల్చండని పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం అందచేసిన పల్నాడు జిల్లా బిసి సంక్షేమ సంఘం.

జ్వాల వారధి పల్నాడు జిల్లా ఇంచార్జ్ బత్తుల వీర వెంకట రాజశేఖర్

ఈరోజు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకరరావు గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్న 28 జిల్లాల్లో కలెక్టర్లకు పార్లమెంట్లో జరుగుతున్న సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళ సబ్ కోటా రిజర్వేషన్ కేటాయించాలని పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షులు బిళ్ళకంటి శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ మహానాడులో పార్లమెంటు బిల్లుతో సంబంధం లేకుండా పార్టీ పరంగా చట్టసభలలో 33% మహిళలకు రిజర్వేషన్లు మొట్టమొదటిసారిగా 2029 నుండి ఏపీలో అమలు జరుపుతామన్న చారిత్రాత్మక నిర్ణయాన్ని ప్రకటించిన టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ కు మహిళా లోకం తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, 33% రిజర్వేషన్లు బీసీ మహిళల సబ్ కోట సంగతి తేల్చాలంటూ సంఘ నాయకులు కోరినారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధికార ప్రతినిధి బాదుగున్నల శ్రీను మాట్లాడుతూ ఈరోజు గ్రీవెన్స్ సందర్భంగా 33% చట్టసభలో మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు సబ్కోట కేటాయించేలా ప్రభుత్వానికి సిఫార్సు చేయవలసిందిగా కలెక్టర్కు మెమోరాండమ్ సమర్పిస్తూ ఆ మేరకు డిమాండ్ చేశారు. ఇంకా 1996 నుండి మహిళా రిజర్వేషన్లు బిసి మహిళా ఉపకోట తేల్చినందుకే కదా ఈ 30 ఏళ్ల పాటు బిల్లును అటకెక్కించారని అన్నారు. నాటి నుండి నేటి వరకు బీసీ మహిళలకు సబ్కోట కోసం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గల్లి నుంచి ఢిల్లీ వరకు అన్ని బీసీ సంఘాలు మహిళా సంఘాలు ఉద్యమిస్తున్న సంగతి తెలుసునని అన్నారు. కాబట్టి ఎట్టగాలకు 2023లో 30% చట్టసభలో మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టం చేశారే గాని ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా ఓబీసీ మహిళల సంగతి తేల్చలేదన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీ మహిళలకు సబ్ కోట ఇవ్వకుండా మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు జరపటం బీసీ సంక్షేమ సంఘం వ్యతిరేకిస్తుందని అలాగే బీసీ సమాజం మొత్తం కూడా వ్యతిరేక దిశగా ఉంటారని తెలియజేసినారు..
ఈ సందర్భంగా మహిళా సంఘ నాయకులు కథం నాగజ్యోతి మాట్లాడుతూ పురుషుల కంటే స్త్రీలు బలహీనమైనందునే రిజర్వేషన్ల ద్వారా వారి సామాజిక న్యాయమందిస్తున్నట్లే ఆధిపత్య వర్గ మహిళల కంటే బీసీ మహిళలు మరింత బల బలహీన వర్గమైనందునే ఈనాడు చట్టసభల మహిళా రిజర్వేషన్లు బిసి మహిళలకు ఉపకోట తప్పక ఉండాలని కోరుతున్నారు, అనాదిగా అన్ని రంగాల్లో అన్ని విధాల వెనుకకు నెట్టబడ్డ బిసి మహిళల అన్ని హంగులు ఉన్నా కూడా ఆధిపత్యం దారి మహిళలతో ఎన్నికలలో పోటీపడి చట్టసభల్లో అడుగుపెట్టడం అసాధ్యమన్నారు అందుకే ఈ మహిళా బిల్లులో బీసీ మహిళ సబ్ కోటా తేల్చాలని కోరినారు. మొత్తం జనాభాలో సగానికి పైగా ఉండే మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కేటాయిస్తున్నట్లే మళ్లీ మొత్తం మహిళలకు జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీ మహిళలకు 33% మహిళా రిజర్వేషన్లు మూడోవంతు అనగా 11% సబ్ కోటా కేటాయించి వెనుకబడిన తరగతుల మహిళా సాధికారతకు తోడ్పాటు అవ్వాలని కోరినారు ఈ కార్యక్రమంలో. .. బిల్లకంటి శ్రీనివాసరావు జిల్లా అధ్యక్షులు, జిల్లా మహిళా సంఘం నాయకులు కదం నాగజ్యోతి, పట్టణ అధ్యక్షుడు కొల్లిపర బాలాజీ, యువజన నాయకులు దమ్మాటి మల్లిఖార్జున, బత్తుల వెంకట రాజశేఖర్, రజక సంఘం నాయకులు ముట్టుకూరు బుజ్జి, కొండ్రాతి కోటేశ్వరరావు, ముదిరాజ్ సంఘ నాయకులు మేకల శ్రీనివాసరావు, బాసు ఆంజనేయులు, లింగాల అంకమ్మరావు తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు.

ఇట్లు
బాదుగున్నల శ్రీను,
రాష్ట్ర అధికార ప్రతినిధి,
ఏపీ బీసీ సంక్షేమ సంఘం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments