జ్వాల వారిది న్యూస్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి చిలుక శంకర్
నిజాంసాగర్ మండలం మాగి గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలీ భద్రయ్య సోమవారం మృతిచెందారు. ఉపాధి హామీ పనుల్లో భాగంగా మొక్కలు నాటుతుండగా అస్వస్థతకు గురవ్వగా వెంటనే తోటి కూలీలు గమనించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు. ఉపాధి హామీ పనుల వద్ద భద్రయ్య మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
