జ్వాలా వారధి న్యూస్ 18 జూలై 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణువర్ధన్ గౌడ్
కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయం గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో మహిళలకు శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలో బి యస్ యన్ యల్ ఆఫీస్ కార్యాలయం నందు గ్రామీణ స్వయం ఉపాధి మహిళలకు శిక్షణ యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత శిక్షణ కార్యక్రమం ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు
ఎమ్మెల్యే చేతులు మీదుగా శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు అందజేయడం జరిగింది
మహిళలు మాట్లాడుతూ గద్వాల ప్రాంతంలో గ్రామీణ స్వయం ఉపాధి యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో నెలరోజులపాటు శిక్షణ నిర్వహించారు టైలరింగ్ బ్యూటీ పార్లర్ ఎంబ్రాయిడింగ్ శిక్షణ ఇవ్వడం జరిగింది నెల రోజుల్లో ఏది సాధ్యం కాదు కాబట్టి మరికొన్ని రోజులు శిక్షణ ఇప్పించి మాకు నైపుణ్యత వచ్చే విధంగా కృషి చేయాలని కోరారు దీని ద్వారా నేర్చుకున్న ద్వారా భవిష్యత్తులో ఆర్థికంగా ఎదిగే విధంగా మాకు ఉపాధి కల్పించే విధంగా శిక్షణ కల్పించాలని కోరారు అదేవిధంగా ప్రభుత్వ నుండి వచ్చే సబ్సిడీ లో రుణాలలో మాకు ప్రాధాన్యత కల్పించాలని కోరారు
ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో మహిళలు కూడా పురుషులతో సమానంగా అన్ని రంగాలలో రాణించడం జరుగుతుంది. ప్రభుత్వం కూడా మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించడం జరుగుతుంది.గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు మహిళా గ్రూప్ పొదుపు సంఘాలలో ఉండడం వల్ల వాటి నుంచి వచ్చే డబ్బులను చిన్న చిన్న పరిశ్రమలను ఏర్పాటు చేసుకొని మహిళలు ఆర్థికంగా బోలోపితం చెందాలి అని అన్నారు.గ్రామీణ ఉపాధి శిక్షణ యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో నెలరోజులు ఈ శిక్షణ ఏర్పాటు చేశారు దీనివల్ల మహిళలకు పూర్తి అవగాహన రాదు కాబట్టి మరోనెల రోజులు శిక్షణ ఏర్పాటు చేసి మహిళలు శిక్షణ పొంది ఎంబ్రాయిడింగ్, టైలరింగ్ బ్యూటీ పార్లర్ వాటిపై మంచి అవగాహన కల్పించి వారికి బతకడానికి సాధ్యమయ్యే విధంగా నైపుణ్యత ఉండాలి వారు భవిష్యత్తులో ఆర్థికంగా ఎదిగే విధంగా శిక్షణ పొంది విధంగా ఉండాలని తెలిపారు.
అదేవిధంగా గద్వాల ప్రాంతంలో ఏదైనా ఒక మహిళలకు సంబంధించిన వస్తువులపై పెద్ద మొత్తన్న పరిశ్రమలు ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా గద్వాలలో పలానా వస్తువు మహిళలకు లభిస్తుందని గద్వాల నుండి ఏదో ఎగుమతి దిగుమతి చేసే విధంగా వ్యాపారము పరిశ్రమను ఏర్పాటు చేయాలని వాటికి కావాల్సిన శిక్షణ మరియు ఆర్థికంగా ఏర్పాటు చేయడానికి నా వంతు కృషి చేస్తాం ప్రభుత్వం తరఫున కూడా కృషి చేసే విధంగా ప్రయత్నిస్తానని తెలిపారు.ప్రస్తుతం ఒక కుటుంబం జీవనం సాగించాలంటే కనీస 30000 రూపాయలు కావాలి మగవారు ఆడవాళ్ళు ఇద్దరు కలిసి పనిచేసినప్పుడు ఆ కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. భవిష్యత్తులో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి నా వంతు పూర్తి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు.
మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ
గ్రామీణ ఉపాధి శిక్షణ యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో మహిళలకు మంచి సువర్ణ అవకాశం కల్పించడం జరిగింది.ప్రతి ఒక్క మహిళలు శ్రద్ధగా నేర్చుకొని నేర్చుకున్న వాటిని ఆచరణలో పెట్టి మహిళా పొదుపు సంఘాల ద్వారా రుణాలను తీసుకొని వ్యాపారాలు చేసుకోవాలి. గతంలో ఎంబ్రాయిడింగ్ చేతి ద్వారా చేయడం జరిగేది ఇప్పుడు మిషన్ల ద్వారా ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ ఫాల్స్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు నేర్చుకొని మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని పేర్కొన్నారు
మున్సిపాలిటీ నుండి మహిళలకు ఎటువంటి సహాయం కావాలన్నా ఎమ్మెల్యే గారికి సహకారంతో నా వంతు కృషి చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ తుమ్మల జయలక్ష్మి నరసింహులు యాదవ్, వైస్ చైర్మన్ శంకర్ యల్ డి యం బ్యాంకర్ అధికారి, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ జంబురామన్ గౌడ మాజీ ఎంపీపీ విజయ్ జిల్లా సీనియర్ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి రమేష్ నాయుడు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కౌన్సిలర్స్ బాబర్ వేదవతి వెంకటేశ్వర రెడ్డి రామలింగేశ్వర కాంమ్లే చంద్రశేఖర్ గోవిందు మాజీ కౌన్సిలర్ మురళి నరహరి గౌడు ఇసాక్ నాయకులు గోవిందు వంట భాస్కర్ సుదర్శన్ ప్రవీణ్ రిజ్వాన్ మోసిన్ ఇలియాజ్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

