అశ్వారావుపేట గడ్డ గర్వించదగ్గ మహా కళాకారుడు ‘ భూక్య కృష్ణ నాయక్’కు జాతీయ పురస్కారం!
జ్వాల వారధి న్యూస్ సెప్టెంబర్ 14 అశ్వరావుపేట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్చార్జిఎం నాగేశ్వరావు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలంలోని నారంవారిగూడెం గ్రామానికి చెందిన మట్టి బిడ్డ, అత్యంత భయంకర సాహస వీరుడు భూక్య కృష్ణ నాయక్ జాతీయ స్థాయిలో మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. తన ప్రాణాలను సైతం లెక్కచేయక ప్రదర్శించే అద్భుతమైన సాహస కళలతో, మూఢనమ్మకాల చీకట్లను పారద్రోలే విజ్ఞాన దీపికగా ఆయన సమాజంలో చైతన్యం రగిలిస్తున్నారు.
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో తన ప్రతిభను ప్రదర్శించి, ఆయా ప్రాంతాల ప్రముఖుల నుండి ఎన్నో ప్రశంసలు, అవార్డులు అందుకని అశ్వారావుపేట మండలానికే
కీర్తి పతాకాన్ని ఎగురవేసిన ఈ సాహసమూర్తిని తాజాగా నెల్లూరు వేదికగా ‘జాతీయ మోటివేషన్ కళాకారుడిగా’ గుర్తించి ఘనంగా సత్కరించారు.
నెల్లూరులో ఘన సత్కారం – ప్రశంసల జల్లు
నెల్లూరు (పొట్టి శ్రీరాములు జిల్లా) లోని ‘వి.యస్.ఆర్ కళ్యాణ మంటపం’ లో శ్రీ ఎంబీ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లోని సాహితీ, కళా రంగాల్లో విశేష కృషి చేసిన ప్రముఖులకు జాతీయ పురస్కార ప్రదానోత్సవం ఘనంగా జరిగింది.
ప్రజల్లో దాగి ఉన్న మూఢనమ్మకాలను పారద్రోలుతూ, సైన్స్ పరిజ్ఞానంపై అవగాహన కల్పిస్తూ, యువతలో జీవ చైతన్యాన్ని నింపుతున్న కృష్ణ నాయక్ సేవలను గుర్తించి, వేదికపై ఉన్న పలువురు ప్రముఖులు ఆయనకు ప్రశంసా పత్రం మరియు జాతీయ అవార్డును అందజేశారు.
సత్కరించిన ప్రముఖులు,
ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ (ఎంబీ రావు ఫౌండేషన్ ఛైర్మన్)
సాధనాల వెంకట స్వామినాయుడు (ప్రముఖ సినీ గేయ రచయిత, హైదరాబాద్)
మామిళ్ళ వెంకట లోకనాథ్ (రి�

