Homeతెలంగాణపిల్లలను ఆదుకున్న టెన్త్ క్లాస్ బ్యాచ్ అనాధ పిల్లలకు ఆదా తీర్చిన క్లాస్ మెంట్

పిల్లలను ఆదుకున్న టెన్త్ క్లాస్ బ్యాచ్ అనాధ పిల్లలకు ఆదా తీర్చిన క్లాస్ మెంట్

జ్వాలా వారధి న్యూస్ 14 సెప్టెంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జ్ జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్

జోగులాంబ గద్వాల్ జిల్లా అనంతపురం గ్రామం టెన్త్ క్లాస్ బ్యాచ్ జడ్పీహెచ్ఎస్ అనంతపూర్ (జోగులాంబ గద్వాల్ జిల్లా గద్వాల మండలం) 2010-11 పదో తరగతి బ్యాచ్‌కి చెందిన పాత విద్యార్థిని ఎస్. జానకి అకాల మరణం చెందడంతో ఆమె పిల్లల భవిష్యత్తు కోసం తోటి క్లాస్‌మేట్స్ మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ రోజు ఆమె పిల్లల చదువు నిమిత్తం స్నేహితులంతా కలిసి ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు:మృతురాలి పేరు: (ఎస్. జానకి)పాఠశాల వివరాలు: జడ్పీహెచ్ఎస్ అనంతపూర్, గద్వాల మండలం (10వ తరగతి, 2010-11 బ్యాచ్)మరణించిన తేదీ: 04-08-2026ఆర్థిక సహాయం (విరాళం): రూ. 75,000 (డెబ్బై ఐదు వేల రూపాయలు)పిల్లల వివరాలు: జానకి కుమార్తె వైష్ణవి ప్రస్తుతం (ఎర్రవల్లి ఎక్స్ రోడ్డు) లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజిబివి) లో 6వ తరగతి చదువుతోంది.జానకి మరణంతో తీరని లోటును ఎదుర్కొంటున్న ఆమె కుటుంబానికి, ముఖ్యంగా కుమార్తె వైష్ణవి భవిష్యత్తుకు మరియు చదువుకు ఈ విరాళం ఎంతగానో తోడ్పడనుంది. కష్టకాలంలో తోటి స్నేహితురాలి కుటుంబానికి అండగా నిలిచిన 2010-11 బ్యాచ్ మిత్రులందరి చొరవ ఎంతో అభినందనీయం (ప్రభుత్వ సహాయం కొరకు కూడా ఆదుకోవాలని స్టూడెంట్ ఆధారపడుతున్నారు దయచేసి ప్రభుత్వం తరఫున తెలిసిన వాళ్ళు ఏదైనా సహాయం చేయాలనుకుంటే అనంతపురం గ్రామం జోగులంబ గద్వాల్ జిల్లా గద్వాల్ మండలంలో దయచేసి పిల్లలకు సహకరించండి తల్లి లేకుంటే ఎన్ని బంగ్లాలో ఉన్న లేనట్లే ఈ కష్టం వచ్చినా తల్లి ఉంటే ప్రపంచాన్ని జయించే శక్తి ఉంటుంది ప్రతి మనిషిలోను అలాంటి తల్లి అకస్మాత్తుగా ఆరోగ్య పరిస్థితి బాగోలేక ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది పిల్లలకి సహాయం చేయాలనుకుంటే ప్రభుత్వం తరఫున దయచేసి సహకరించండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments