జ్వాలా వారధి న్యూస్ 20 జూలై 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణువర్ధన్ గౌడ్
నీట్ పేపర్లో లీకేజీలతో పాటు దేశవ్యాప్తంగా పరీక్షల్లో జరుగుతున్న అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, దేశంలో ప్రశ్నించే గొంతులపై నిర్బందాన్ని ఆపాలని సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఉప్పేర్ నరసింహ వీవీ నరసింహ డిమాండ్ చేశారు. పర్యావరణవేత్త సోనం వాంగ్ చుక్ అక్రమ అరెస్టును నిరసిస్తూ సోమవారం జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ లో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీకేజీలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను క్యాబినెట్ నుండి తొలగించాలని విద్యార్థులు యువత మేధావులు డిమాండ్ చేస్తున్నప్పటికీ,యూనియన్ గవర్నమెంట్ పట్టించుకోకుండా ఉండటం అన్యాయం అన్నారు. లక్షలాదిమంది విద్యార్థుల భవితవ్యం కోసం సి జై పి వ్యస్థాపకుడు పర్యావరణ వేత్త సోనం వాంగ్ చుక్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను నిరంకుశత్వంతో అణచివేయడం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమన్నారు. ప్రభుత్వం తన తప్పిదాలను సరి చేసుకోకుండా విద్యార్థుల పక్షాన నిలబడుతున్న సోనం వాంగ్ చుక్ వంటి మేధావులను అక్రమంగా అరెస్టు చేసి నిర్బంధించడం అన్యాయమన్నారు. ప్రభుత్వం చేస్తున్న లోపాలను ఎత్తి చూపడానికి కూడా స్వేచ్ఛ లేకుండా ప్రతిపక్షాలను అణచివేస్తున్న ప్రభుత్వ నిరంకుశ వైఖరి సమర్ధనీయం కాదన్నారు. చివరికి అత్యున్నత న్యాయస్థానాలే చొరవ తీసుకొని సమస్య పరిష్కారానికి మార్గాలు వెతకాలని చెప్పడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం అన్నారు. తక్షణమే యూనియన్ గవర్నమెంట్ అక్రమంగా నిర్బంధలోకి తీసుకున్న సోనం వాంగ్ చుక్ ను విడుదల చేసి, శాంతియుత నిరసన కార్యక్రమాలకు అనుమతి ఇవ్వాలని, నీటి పేపర్ లీకేజీలో పరీక్షల నిర్వహణలో అవకతవకలపై ఢిల్లీలో ఆందోళన చేస్తున్న యువతపై నిర్బంధ ఆపాలని లేని పక్షంలో ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు శివకుమార్,చిన్న వెంకటేష్,నిజాం,మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలతో ఉప్పేర్ నరసింహ సి ఐ టి యు జిల్లా అధ్యక్షుడు జోగులాంబ గద్వాల జిల్లా
