Homeతెలంగాణజిల్లాలోని గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు నాణ్యంగా అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని...

జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు నాణ్యంగా అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అదనపు కలెక్టర్ బి.నర్సింగ్ రావు ఆదేశించారు

జ్వాలా వారధి న్యూస్ 20 జూలై 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణువర్ధన్ గౌడ్

సోమవారం మల్దకల్ మండలం బిజ్జారం (పరమాల) గ్రామంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ గురుకుల పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి గదులు విద్యార్థుల వసతి గృహాలు వంటశాల భోజనశాల పరిశుభ్రత తాగునీటి సౌకర్యం విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యత తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సురక్షితమైన పరిశుభ్రమైన వాతావరణం కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.ఆహార నాణ్యత, పారిశుధ్యం తాగునీటి సౌకర్యాల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.విద్యార్థుల అవసరాలను ఎప్పటికప్పుడు గుర్తించి వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని పాఠశాల సిబ్బందికి ఆదేశించారు.
అనంతరం విద్యార్థులతో ముచ్చటించిన అదనపు కలెక్టర్ వారి విద్యాభ్యాసం వసతి సౌకర్యాల గురించి తెలుసుకొని వారికి నోట్‌బుక్స్,బెడ్‌షీట్లు పంపిణీ చేసి,బాగా చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ప్రోత్సహించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్,ఉపాధ్యాయులు, సిబ్బంది మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు జారీ చేయువారు డీపీఆర్ఓ జోగులాంబ గద్వాల జిల్లా.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments