కామారెడ్డి జిల్లా ప్రతినిధి చిలుక శంకర్
కామారెడ్డి జిల్లా.నిజాంసాగర్ మండలంలోని నల్లవాగు మత్తడి వద్ద కొలువుదీరిన మైసమ్మ అమ్మవారి పండుగను ఆదివారం , నర్సిం గ్ రావుపల్లి గ్రామస్తులు వైభవంగా నిర్వహించారు. గ్రామం నుంచి డప్పుల సప్పులతో ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు, నైవేద్యాలు సమర్పించారు. అనంతరం గ్రామ ప్రజలు వంటావార్పులు చేసుకుని సాయంత్రం వరకు అక్కడే గడుపుతారు మతడిలో నీరు పరవాళ్ళు తొక్కి. పంటలు సమృద్ధిగా పండాలని కోరుకుంటూ ప్రతి ఏడాది ఈ సంప్రదాయ పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు.
