జ్వాల వారధి న్యూస్ 31 జూలై 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణువర్ధన్ గౌడ్
జోగులాంబ గద్వాల్ జిల్లా ధరూర్: మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మండలంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక ఎస్సై బి నందికర్ అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ విద్యుత్ ప్రమాదాల అవకాశాలు ఎక్కువగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇటీవల రాష్ట్రంలో వర్షాల సమయంలో విద్యుత్ షాక్‌ల వల్ల ప్రమాదాలు చోటుచేసుకొన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించడం అత్యంత అవసరం ఉందన్నారు.
ప్రజలు తప్పనిసరిగా పాటించవలసిన జాగ్రత్తలు
తెగిపోయిన లేదా కిందపడిన విద్యుత్ తీగలకు ఎట్టి పరిస్థితుల్లోనూ దగ్గరగా వెళ్లవద్దని విద్యుత్ స్తంభాలు ట్రాన్స్‌ఫార్మర్లు జంక్షన్ బాక్సుల వద్ద నీరు నిల్వ ఉంటే వాటికి దూరంగా ఉండండి అని తెలిపారు తడి చేతులతో విద్యుత్ స్విచ్‌లు లేదా ఎలక్ట్రికల్ పరికరాలను తాకవద్దు అని పిల్లలను విద్యుత్ స్తంభాలు తీగలు ట్రాన్స్‌ఫార్మర్ల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తగా చూడాలని తెలిపారు ఇంట్లో వైరింగ్ ఎర్తింగ్ సరిగా ఉందో లేదో పరిశీలించుకుని లోపాలు ఉంటే అర్హత కలిగిన ఎలక్ట్రిషియన్‌తోనే మరమ్మతులు చేయించాలని అన్నారు చెట్లు విద్యుత్ తీగల పై పడినా లేదా తీగలు వాలి కనిపించినా వెంటనే విద్యుత్ శాఖకు సమాచారం ఇవ్వాలి తెలిపారు వర్షం ఉరుములు, మెరుపుల సమయంలో విద్యుత్ స్తంభాలు లేదా చెట్ల కింద నిలబడవద్దని, ఎవరైనా విద్యుత్ షాక్‌కు గురైతే నేరుగా తాకకుండా ముందుగా విద్యుత్ సరఫరా నిలిపివేసి సహాయక చర్యలు చేపట్టి వెంటనే 108 లేదా 100 సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలి అని ధరూర్ మండల ఎస్సై నందికర్ తెలిపారు.
