HomeUncategorizedగ్రామ మండల జిల్లా అధికారులు కూడా ఆలోచన చేయండి కొత్త గ్రామానికి న్యాయం చేయండి

గ్రామ మండల జిల్లా అధికారులు కూడా ఆలోచన చేయండి కొత్త గ్రామానికి న్యాయం చేయండి

జ్వాల వారధి న్యూస్ 23 జూల్తె 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణువర్ధన్ గౌడ్

యం అర్ ఓ ఆఫీస్ కొత్త రాజోలిలోనే కట్టండి… 17 ఏళ్ల అన్యాయానికి తెర దించండి గ్రామ పెద్దలు ముందుకు రండి కొత్త రాజోలి అభివృద్ధికి న్యాయం చేయండి మండల కేంద్రమైన రాజోలి గ్రామ ప్రజలారా ఒకసారి ఆలోచించండి 2009 అక్టోబర్ 2 తేదీ తుంగభద్ర వరదల తర్వాత ప్రభుత్వమే “పాత రాజోలి ముంపు గ్రామం” అని అధికారికంగా ప్రకటించి కొత్త రాజోలికి తరలించింది. కానీ 17 ఏళ్లు గడిచినా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఇంకా పాత గ్రామంలోనే ఉన్నాయి.పాత రాజోలిలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల జాబితా 1.హైస్కూల్ 2.చిన్నబడి 3.గ్రామపంచాయతీ 4.పశువుల ఆసుపత్రి 5.యునాని ఆసుపత్రి
6.యూనియన్ బ్యాంకు 7.పోస్ట్ ఆఫీస్
8.మండల విద్యాశాఖ ఆఫీస్.
9.యం పి డి ఓ ఆఫీస్
10.టెలిఫోన్ భవన్ 11.పోలీస్ స్టేషన్ 12.రైతు వేదిక 13.చేనేత సహకార సంఘం
14.అగ్రికల్చర్ ఆఫీస్ 15.కో-ఆపరేటివ్ సొసైటీ 16.పాల కేంద్రం
17.షాదీఖానా 18.బీసీ కమిటి హాలు 19.కళ్యాణ వేదిక 20.సత్యం & సుమేద స్కూల్స్
ముంపు అని తెలిసి కూడా అన్ని ఆఫీసులు పాత గ్రామంలోనే ఎందుకు
2500 కుటుంబాలు – 11,000 మంది ఉన్న కొత్త రాజోలికి ఒక్క ఆఫీస్ కూడా ఎందుకు లేదు ఇక చాలదా కొత్త రాజోలికి జరుగుతున్న అన్యాయం మన డిమాండ్ వరద ముంపు ప్రాంతంలో కొత్త ఆఫీసులు వద్దు యం అర్ ఓ ఆఫీస్ ను కొత్త రాజోలి గ్రామంలోనే నిర్మించాలి ఇదే మొదటి అడుగు అవుతుంది కొత్త రాజోలి అభివృద్ధికి నాంది అవుతుంది గ్రామ పెద్దలకు సర్పంచ్ గారికి విన్నపం మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి కొత్త రాజోలి అభివృద్ధికే మా ప్రాధాన్యత అని నిరూపించండి కొత్త రాజోలి హక్కు కోసం కదలండి అన్యాయాన్ని ప్రశ్నించండి జై రైతన్న జై చేనేతన్న జై జై కొత్త రాజోలి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments