జ్వాలా వారధి న్యూస్ 21 జూలై 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణువర్ధన్ గౌడ్
తెలంగాణ రాష్ట్రంలో కమీషన్ చెల్లించకపోతే కాంట్రాక్టర్ల బిల్లులు వచ్చే పరిస్థితి లేదు రాష్ట్రంలో కాంగ్రెస్, బిఆర్ఎస్ ఓప్పంద రాజకీయాలు తెలంగాణ అభివృద్ధి బిజెపి డబల్ ఇంజన్ సర్కార్ తోనే సాధ్యం..డికె. స్నిగ్ద రెడ్డి ఈ రోజు కేటీ దొడ్డి మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు శ్రీ పాద రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బీజేపీ మండల కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా యువ నాయకురాలు డికె. స్నిగ్ద రెడ్డి హాజరైయ్యారు ఈ సందర్భంగా జిల్లా యువనాయకురాలు డికె. స్నిగ్ద రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం ప్రభుత్వం పూర్తిగా అప్పుల్లో కూరుకు పోయిందని గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే తప్ప రాష్ట్ర ప్రభుత్వం నిధులు పైసా లేదని అన్నారు
కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకిరావడానికి అబద్ధపు హామీలు జూట మాటలు చెప్పేందుకు సిద్ధమవుతున్నారని ప్రజలు కాంగ్రెస్ నాయకుల మాయలో పడకుండా కార్యకర్తలు ప్రభుత్వం కావాలని అన్నారు ప్రస్తుతం కొనసాగుతున్న యస్ ఐ ఆర్ ప్రక్రియను పార్టీ శ్రేణులు బాధ్యతాయుతంగా తీసుకుని చురుకుగా పాల్గొనాలని కోరారు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల వైఫల్యాలు, దుష్పరిపాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారు. ఈ రెండు పార్టీల నిర్లక్ష్యం, దూరదృష్టి లేని పాలన కారణంగా తెలంగాణ రాష్ట్రం నష్టపోయింది తెలంగాణ ప్రజలకు పారదర్శకమైన అభివృద్ధి కేంద్రితమైన జవాబుదారీతనంతో కూడిన సుపరిపాలన అందించగల ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీది మాత్రమే అని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు జిల్లా బిజెవైఎం అధ్యక్షుడు బాబుల్ రెడ్డి కౌన్సిలర్ శాలన్న ఉపసర్పంచ్ ఎర్రభీం రెడ్డి,కెటి దొడ్డి మండల సీనియర్ నాయకులు యార్సన్ దొడ్డి హనుమంతు ,కేటి దొడ్డి అశోక్ రఘు,దేవేందర్ రెడ్డి, ఉమిత్యాల కర్రెప్ప, పాగుంట, సర్పంచ్ అంజనప్ప, ఉప సర్పంచ్ నర్సిరెడ్డి కృష్ణ కాంత్ కొండన్న అంపిరెడ్డి కుచినెర్ల నరసింహులు రంగాపురం కృష్ణ గోవిందు శంకర్ నాయక్ వాచ్ నాయక్ తదితరులు హాజరయ్యారు
