Homeతెలంగాణఓం శ్రీ సాయిరాం ఫైనాన్స్ బాధితులకు సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ మల్లురవి భరోసా!

ఓం శ్రీ సాయిరాం ఫైనాన్స్ బాధితులకు సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ మల్లురవి భరోసా!

జ్వాల వారధి న్యూస్ 20 జూలై 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణువర్ధన్ గౌడ్

ఓం శ్రీ సాయిరాం ఫైనాన్స్ బాధితులకు తక్షణ న్యాయం చేయాలి
జప్తు చేసిన ఆస్తులను బహిరంగ వేలం వేసి బాధితులను ఆదుకోవాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి సానుకూల స్పందన
సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి బాధితుల సంఘం అధ్యక్షుడు ఒగ్గు పర్వతాలు నేడు నాగర్ కర్నూల్ లో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ నాగర్‌కర్నూల్ జిల్లాలో సంచలనం సృష్టించిన ఓం శ్రీ సాయిరాం ఫైనాన్స్ ఆర్థిక మోసానికి గురైన బాధితులకు త్వరలోనే పూర్తి న్యాయం చేస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి మరియు పార్లమెంట్ సభ్యులు డా.మల్లురవి సానుకూలంగా స్పందిస్తూ హామీ ఇచ్చారు అని తెలిపారు ఈ రోజు బాధితుల సంఘం ప్రతినిధులు ప్రజాప్రతినిధులను కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని, దారుణ పరిస్థితులను ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో వివరించగా,వారు బాధితుల పక్షాన నిలబడి తక్షణమే న్యాయం జరిగేలా చూడాలని అధికారులను కోరారు నాగర్‌కర్నూల్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రైమ్ నెం. 75/2023 దర్యాప్తు ప్రకారం,నిందితులు అమాయక ప్రజల నుండి దాదాపు రూ.150 కోట్లకు పైగా డిపాజిట్లను అక్రమంగా వసూలు చేసినట్లు తేలింది.ముఖ్యంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల సాగునీటి పథకం కోసం తమ పూర్వీకుల వ్యవసాయ భూములను ప్రభుత్వానికి అప్పగించిన నాగర్‌కర్నూల్,వనపర్తి జిల్లాల చిన్న, సన్నకారు రైతులు ఈ ఘోర మోసానికి బలి అయ్యారు.భూసేకరణ ద్వారా ప్రభుత్వం అందించిన పరిహారమే ఆయా కుటుంబాలకు జీవనాధారంగా మిగలగా, నిందితులు ప్రతి నెల 2% వడ్డీ ఇస్తామని,ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తామని నమ్మబలికి 2017 నుండి 2021 మధ్య కాలంలో రైతుల జీవితకాల కష్టార్జితాన్ని డిపాజిట్ల రూపంలో లాగేసుకున్నారు.చివరకు వడ్డీ కానీ,అసలు కానీ ఇవ్వకుండా చెల్లని బాండ్ పేపర్లు,రశీదులు ఇచ్చి మోసం చేశారు అని వాపోయారు.ఈ దారుణ ఆర్థిక మోసాన్ని భరించలేక,అప్పుల భారం తట్టుకోలేక తీవ్ర మానసిక వేదనతో ఇప్పటివరకు సుమారు 150 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడం ఒక సామాజిక విపత్తుగా మారింది.ఒకప్పుడు గౌరవంగా బతికిన భూ యజమానులు నేడు రోజువారీ కూలీలుగా మారి జీవనం సాగిస్తున్నారని,పిల్లల చదువులు మధ్యలోనే ఆగిపోయి,ఆడపిల్లల పెళ్ళిలు వాయిదా పడుతూ దారుణ పరిస్థితులను ఎదుర్కొంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.బాధితుల సమస్యపై స్పందించిన ప్రభుత్వం గతంలోనే 17.06.2025 తేదీన (హోం శాఖ)ద్వారా నిందితుల స్థిర,చర ఆస్తులను అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ,నేటికీ ఆ ఆస్తులను వేలం వేయకపోవడంతో బాధితులకు ఒక్క రూపాయి కూడా చేరలేదు.
ఈ నేపథ్యంలో నేడు జరిగిన కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి,బాధితుల సంఘం నాయకులు ఒగ్గు పర్వతాలు పాల్గొని బాధితులతో కలిసి తమ సమస్యను విన్నవించారు.తాము ప్రభుత్వం నుండి ఎలాంటి ఉచిత ఆర్థిక సహాయాన్ని లేదా ఎక్స్‌గ్రేషియాను ఆశించడం లేదని,చట్టప్రకారం ఇప్పటికే జప్తు చేసిన నిందితుల ఆస్తులను తక్షణమే అత్యవసర ప్రాతిపదికన బహిరంగ వేలం వేసి,ఆ మొత్తాన్ని డిపాజిటర్లకు సత్వరమే పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేశారు.దీనిపై సీఎం రేవంత్ రెడ్డి మరియు ఎంపీ మల్లురవి సానుకూలంగా స్పందిస్తూ,జప్తు చేసిన ఆస్తుల వేలం ప్రక్రియను వేగవంతం చేసి బాధితులందరికీ చట్టబద్ధంగా న్యాయం జరిగేలా చూస్తామని గట్టి భరోసా ఇచ్చారని తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments