Homeతెలంగాణనర్సింగ్ రావుపల్లి - మంగ్లూర్ రోడ్డు అధ్వాన్నం: ప్రయాణికులు, రైతులకు ఇబ్బందులు

నర్సింగ్ రావుపల్లి – మంగ్లూర్ రోడ్డు అధ్వాన్నం: ప్రయాణికులు, రైతులకు ఇబ్బందులు

జ్వా లా వారిది న్యూస్: కామారెడ్డి డిస్ట్రిక్ట్ ఇంచార్జ్ చిలుక శంకర్

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం నర్సింగ్ రావుపల్లి నుండి మంగ్లూర్ వెళ్లే దారి బురద, గుంతలతో నిండిపోయింది. వర్షాల వల్ల ఈ రోడ్డు పూర్తిగా పాడైపోవడంతో వాహనదారులు, ప్రజలు ప్రయాణించడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.
ముఖ్యంగా ఈ దారిన పొలాలకు వెళ్లే రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. వ్యవసాయ పనులు సకాలంలో చేసుకోలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బైక్‌లపై వెళ్లేవారు గుంతల్లో పడి ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రైవేట్ స్కూల్ బస్సుల రాకపోకలు కూడా నిలిచిపోయాయి.
అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి ఈ రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని, శాశ్వతంగా కొత్త రోడ్డు నిర్మించి తమ సమస్యను తీర్చాలని గ్రామస్థులు కోరుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments