జ్వాల వారధి న్యూస్ 22 సెప్టెంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జ్ జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్
నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి…బియ్యం, పప్పు, నూనె, చక్కెర, కూరగాయలు కొనాలన్నా పేదవాడు ఆలోచించాల్సిన పరిస్థితి
ఇంటి అద్దె కట్టాలీ కరెంట్ బిల్లు చెల్లించాలీ
మందులు కొనాలీ కుటుంబాన్ని పోషించాలి రోజువారీ అవసరాలు తీర్చుకోవాలి ఇవన్నీ కలిపి చూసినప్పుడు 4,000 పెన్షన్‌తో ఒక వికలాంగుడు గౌరవంగా ఎలా జీవించగలడు కేంద్ర ప్రభుత్వం అయినది రాష్ట్ర ప్రభుత్వం అయినా పేదవాడి జీవితాన్ని కాగితాల మీద లెక్కలతో కాదు నిజ జీవితంలో అతను ఎదుర్కొంటున్న కష్టాలతో చూడాలి
ధరలు పెరుగుతున్నప్పుడ
పెన్షన్ మాత్రం అదే స్థాయిలో ఉంటే అది సహాయం కాదు బతుకుదెరువు కోసం చేసే పోరాటాన్ని మరింత కష్టతరం చేయడమే
వికలాంగులు అడిగేది దానం కాదు భిక్ష కాదు గౌరవంగా జీవించేందుకు సరిపడే ఆర్థిక భద్రత ప్రభుత్వాలు ఒక్కసారి మా జీవితాల్లోకి వచ్చి చూడాలీ 4,000తో ఒక నెల కుటుంబాన్ని నడిపి
