జ్వాల వారిది న్యూస్ ఆగస్టు 28 అశ్వరావుపేట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఎం నాగేశ్వరరావు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలోని గాండ్లగూడెం నుండి చెన్నాపురం వరకు బీటి రోడ్డు నిర్మాణం పనులు ఏళ్ల తరబడి రహదారి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న గిరిజనులకు ఎట్టకేలకు బీటీ రోడ్డు సౌకర్యం అందుబాటులోకి రానుంది. అశ్వారావుపేట మండలం గాండ్లగూడెం నుంచి చెన్నాపురం వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ భద్రాచలం, గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎస్టీఎస్‌డీఎఫ్ 2025–26 నిధులతో ఈ రహదారి నిర్మాణం చేపడుతున్నారు.
గాండ్లగూడెం నుంచి చెన్నాపురం వరకు నిర్మించనున్న బీటీ రహదారికి రూ.525.37 లక్షల అంచనా వ్యయంతో గత నెల 17న ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ శంకుస్థాపన చేశారు. అనంతరం పనులు ప్రారంభమై ప్రస్తుతం వేగంగా కొనసాగుతున్నాయి. రహదారి నిర్మాణం పూర్తయితే మారుమూల గిరిజన గ్రామాలకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి.
ఇప్పటివరకు రహదారి సౌకర్యం సరిగా లేక విద్య, వైద్యం, వ్యవసాయం, నిత్యావసరాల కోసం రాకపోకలు సాగించడంలో గిరిజనులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా ఉండేదని స్థానికులు చెబుతున్నారు. బీటీ రోడ్డు నిర్మాణంతో ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని గిరిజనులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
రహదారి పనులు వేగంగా సాగుతుండటంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక సర్పంచ్, పాలకమండలి సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ఈ రహదారి నిర్మాణం �

