Homeతెలంగాణజాతీయ ఎస్టీ కమిషన్‌కు అన్నారం గ్రామస్తుల ఫిర్యాదు

జాతీయ ఎస్టీ కమిషన్‌కు అన్నారం గ్రామస్తుల ఫిర్యాదు

జ్వాలా వారిది న్యూస్ ఆగస్టు 26 అశ్వరావుపేట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఎం నాగేశ్వరరావు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములకలపల్లి మండలంలోని సీతారాంపురం గ్రామపంచాయతీ పరిధిలోని అన్నారం, చింతలపాడు, గుర్రాలకుంట, ధర్మన్ననగర్ గ్రామాలకు వెళ్లే మార్గంలో మూడు వాగులపై హై లెవల్ వంతెనల నిర్మాణానికి శంకుస్థాపన చేసి సుమారు రెండు సంవత్సరాలు గడుస్తున్నా, ఇప్పటివరకు పనులు ప్రారంభం కాకపోవడంపై అన్నారం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తూ మంగళవారం కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి విచ్చేసిన జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ ను గ్రామస్తులు ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేశారు. అనంతరం ఫిర్యాదు పత్రాన్ని బీజేపీ నాయకులు పొనిశెట్టి వెంకటేశ్వర్లు, భూక్యా సీతారాం నాయక్ ఆధ్వర్యంలో కమిషన్ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ మూడు వాగులపై హై లెవల్ వంతెనల నిర్మాణం పూర్తయితే నాలుగు గ్రామాల ప్రజలకు రాకపోకల సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుందని తెలిపారు. శంకుస్థాపన జరిగి రెండేళ్లు గడిచినా పనులు ప్రారంభం కాకపోవడంతో వర్షాకాలంలో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కమిషన్ సభ్యుల దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా అత్యవసర వైద్య పరిస్థితుల్లో ఆసుపత్రులకు వెళ్లేందుకు, విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు, రైతులు వ్యవసాయ పనుల కోసం రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు ఈ విషయంపై సంబంధిత అధికారులతో మాట్లాడి, హై లెవల్ వంతెనల నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో పర్సిక సత్యం, వర్స సోము�

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments