జ్వాల వారధి న్యూస్ 25 ఆగస్టు 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్
40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతోంది రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయాలి
రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డికె.అరుణమ్మ సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని ఈ రోజు గద్వాల పట్టణంలోని బిజెవైఎం యువ మోర్చా బాబుల్ రెడ్డి ఆధ్వర్యంలో యం ఎ యల్ డి కాలేజ్ నుండి క్రిష్ణ వేణి చౌక్,రాజీవ్ మార్గ్, పాత బస్టాండ్ విద్యార్థులతో కలిసి ’ఫీజుల బకాయి – బీజేపీ లడాయి’ కార్యక్రమం ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి భరత్ ప్రసాద్, జిల్లా యువ నాయకురాలు డికె. స్నిగ్ద రెడ్డి హాజరై మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో వేలాది మంది విద్యార్థులు ఉన్నత విద్యను కొనసాగిం చడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కళాశాలల యాజమాన్యాలు కూడా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాయని పేర్కొ న్నారు. విద్యార్థుల చదువుకు ఎలాంటి ఆటంకాలు కలగ కుండా ప్రభుత్వం వెంటనే పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేసి వారికి పూర్తి భరోసా కల్పించాలని కోరారు విద్యార్థుల సమస్యల పరిష్కారానికి బీజేపీ నిరంతరం పోరాటం చేస్తుందని, ప్రభుత్వం స్పందించే వరకు ప్రజా స్వామ్య బద్ధమైన ఆందో ళనలు కొన సాగిస్తామని స్పష్టం చేశారు
ఈ కార్యక్రమంలో జిల్లా యువ నాయకురాలు డికె. స్నిగ్ద రెడ్డి జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామచంద్ర రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ మేంబర్ బండల వెంకట రాములు ,జిల్లా ప్రధాన కార్యదర్శి రవి కుమార్ ఎక్బోటే, శ్యామ్ రావ్,బిజెవైఎం జిల్లా అధ్యక్షుడు బాబుల్ రెడ్డి జిల్లా మహిళ మోర్చా అధ్యక్షుడు సమత గౌడ్,కిసాన్ మోర్చా అధ్యక్షుడు కిష్టాన్న,ఓబీసీ మోర్చా అధ్యక్షుడు దాస్,పట్టణ అధ్యక్షురాలు రజక జయశ్రీ నరసింహులు, కౌన్సిలర్లు శాలన్న, చంద్ర శేఖర్ మండల అధ్యక్షులు తిరుపతి రెడ్డి శ్రీనివాసులు,తిమ్మా రెడ్డి,మరియు అక్బర్ పాషా బిజెవైఎం నాయకులు పాండు గాంజ సాయి సతీష్ పవన్ అశోక్ తిరుమల్ శివ తదితరులు ఉన్నారు
