Homeతెలంగాణఐజ మండల కేంద్రం అలంపూర్ నియోజకవర్గం

ఐజ మండల కేంద్రం అలంపూర్ నియోజకవర్గం

జ్వాల వారధి న్యూస్ 02 సెప్టెంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జ్ జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్

వెయ్యి రోజుల పాలన కాదు ఇది దగా పాలన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మోసపూరిత హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడతాం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మరియు జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య ఐజ పట్టణ బి అర్ ఎస్ పార్టీ అధ్యక్షులు, న్యాయవాది మాస్టర్ మధు కుమార్ బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు మరియు ఎమ్మెల్సీ చల్లా వెంకటరామిరెడ్డి గారు, అలంపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే విజయుడు ఆదేశాల మేరకు వెయ్యి రోజుల విఫల పాలనపై బీఆర్ఎస్ నిరసన కార్యక్రమంలో భాగంగా మొదటి రోజున అలంపూర్ నియోజకవర్గ ఐజ మండల కేంద్రంలోని రాయచూరు చౌరస్తాలో ధర్నా నిర్వహించి, ఫ్లెక్సీ ప్రదర్శించి, బాకీ కార్డులను పంచి రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన మోసపూరితమైన ఆరు గ్యారెంటీలను 420 హామీలను ఎండగట్టడం జరిగింది.బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమమునకు టిటి దొడ్డి మాజీ ఎంపీటీసీ ఉమేష్ గౌడ్, కౌన్సిలర్ డాక్టర్ కృష్ణ, కో ఆప్షన్ మెంబర్ మౌల, పార్టీ సీనియర్ నాయకులు రంగు మద్దిలేటి, హోంనీడ్ ఆంజనేయులు, అంజి బాబు, లెనిన్, తుపత్రాల వీరేష్, నరేష్, పులికల్ కురువ రామకృష్ణ, రామాంజనేయులు, బోయ రామకృష్ణ, సురేష్ కూరగాయల రామన్న, బలరాం, కొత్తింటి మల్లి, స్వామినాథ్, నడిపేన్న, బైనపల్లి మైబు, నరసింహులు, వీరేష్, రామచంద్ర, వాపనగిరి రవి, రాజు, చంటి రైతులు పార్టీ నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
ఈ సందర్బంగా బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కురువ పల్లయ్య మాట్లాడుతూ
ఆరు గ్యారెంటీలకు మంగళం
420 హామీలకు పంగనామాలు కమిషన్లతో ఊరేగుతున్న రేవంత్ రెడ్డి సర్కార కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో జరిగిన అరాచకాలు, వ్యవస్థల నిర్వీర్యం, ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో,
కాంగ్రెస్ ప్రభుత్వ ఘోర వైఫల్యాలను ఎండగడుతాం అని అన్నారు.ఆరు గ్యారంటీల పేరుతో బాండ్‌ పేపర్లు రాసిచ్చి, వంద రోజుల్లో అమలు చేస్తామని ప్రజలను నమ్మబలికిన కాంగ్రెస్..
1000 రోజులు గడుస్తున్నా ఆ హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది అని అన్నారు.
కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యి లాగా రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పగిస్తే
దాన్ని రేవంత్ మరింత ముందుకు తీసుకెళ్లాల్సింది పోయి, పూర్తిగా నాశనం చేసి కుప్పకూల్చాడు.
పురోగమనం వైపు వేగంగా ప్రయాణం చేయాల్సిన రాష్ట్రం..
ఈ కాంగ్రెస్ ప్రభుత్వ చేతకానితనంతో తిరోగమనం వైపు పయనిస్తోంది అని అన్నారు.

ఆరు గ్యారెంటీలకు పంగనామాలు పెట్టి, 420 హామీలకు మంగళం పాడి ఈరోజు వెయ్యి రోజుల పాలన అని ఊరేగుతున్నారు తప్ప ఒక్క హామీ కూడా అమలు చేయని చేతకాని దద్దమ్మ ప్రభుత్వం అని అన్నారు.

ఈరోజు రాష్ట్రంలో కరెంట్ లేక చీకటి, నీళ్లు లేక రైతుల కళ్ళలో కన్నీళ్లు.

ఇది 1000 రోజుల పాలన కాదు,
వెయ్యి రోజుల కాంగ్రెస్ ప్రజా పీడన..!

తెలంగాణ రాష్ట్రం మీద దరిద్రం దండయాత్రకు వెయ్యి రోజులు..

కేసీఆర్ మాటల్లో చెప్పాలంటే ఇది ఒక సర్వ భ్రష్ట ప్రభుత్వం

రేవంత్ మాటల్లో ఈ వెయ్యిరోజుల కాంగ్రెస్ పాలన క్రిమినల్ వేస్ట్..అని అన్నారు.రైతులను విద్యార్థులను నిరుద్యోగులను సబ్బండ వర్గాలను మోసం చేసిన దుర్మార్గమైన ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ ప్రభుత్వమని అన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments