సెప్టెంబర్ 2 నుంచి ఏడు రోజుల పాటు బీఆర్ఎస్ నిరసనలు
ఆరు గ్యారంటీల అమలుపై కాంగ్రెస్‌ను నిలదీస్తాం
ప్రజా సమస్యలపై పోరాటానికి సమరశంఖం పూరించిన బీఆర్ఎస్
జ్వాలా వారధి న్యూస్ ఆగస్టు 31 అశ్వరావుపేట భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఎం నాగేశ్వరరావు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలోని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతున్న సందర్భంగా ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు బీఆర్ఎస్ పార్టీ సమరశంఖం పూరించింది. సెప్టెంబర్ 2వ తేదీతో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వంద రోజుల్లో అమలు చేస్తామని ప్రకటించి, వెయ్యి రోజులు పూర్తవుతున్నా హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అశ్వారావుపేట నియోజకవర్గ ఇన్‌చార్జి మెచ్చా నాగేశ్వరరావు ఆదేశాల మేరకు నియోజకవర్గ వ్యాప్తంగా ఏడు రోజుల పాటు వరుస నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు అశ్వారావుపేట మండల బీఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ జూపల్లి రమణరావు తెలిపారు.
ఏడు రోజుల పాటు రోజుకో కార్యక్రమం
వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టడమే లక్ష్యంగా ఏడు రోజుల పాటు రోజుకో వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. పారిశుధ్యం, విద్య, వైద్యం, వ్యవసాయం, విద్యుత్, మహిళలు, వృద్ధులు, వికలాంగులు, యువతకు సంబంధించిన సమస్యలను ప్రజల ముందుకు తీసుకెళ్లి వాస్తవాలను వివరించనున్నట్లు పేర్కొన్నారు.
మొదటి రోజు.. సెప్టెంబర్ 2: నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నా
