Homeతెలంగాణవిద్యార్థులకు ఉచిత ఏకరూప దుస్తులు పంపిణీ చేసిన

విద్యార్థులకు ఉచిత ఏకరూప దుస్తులు పంపిణీ చేసిన

జ్వాల వారధి న్యూస్ 31 ఆగస్టు 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జ్ జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్

జోగులాంబ గద్వాల్ జిల్లా పెద్దపల్లి గ్రామ సర్పంచ్ అల్వాల శిరీష రాజశేఖర్ రెడ్డి  గద్వాల నియోజకవర్గం మండలంలోని పెద్దపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ప్రాథమిక పాఠశాలలో సోమవారం విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా అందించిన ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ అల్వాల శిరీష రాజశేఖర్ రెడ్డి విద్యార్థులకు దుస్తులు అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ అల్వాల శిరీష మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థుల కోసం ఉచితంగా అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుపై దృష్టి పెట్టి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.పాఠశాల స్థాయి నుంచే విద్యపై ఆసక్తి పెంచుకోవాలని తెలిపారు.విద్యార్థులు ఉన్నతంగా చదివి భవిష్యత్తులో మంచి స్థాయికి చేరుకోవాలని తద్వారా కన్న తల్లిదండ్రులతో పాటు గ్రామానికి కూడా పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలని వారు సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు జయలక్ష్మి ఉపసర్పంచ్ లక్ష్మి నర్సింహా వార్డు మెంబెర్ శివ గ్రామస్తులు సువర్ణ రమేష్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments