
జ్వాల వారిది న్యూస్ ఆగస్టు 31 అశ్వరావుపేట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఎం నాగేశ్వరరావు
హైదరాబాద్ శివారు తుక్కుగూడలో రెండు రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన నర్సు శిరీష మృతదేహం తన స్వగ్రామం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చౌటిగూడెం గ్రామానికి చేరింది. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ శిరీష మృతదేహం అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అక్కడే ఉండి అంతిమయాత్రలో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు, పలువురు ప్రజాప్రతినిధులు శిరీష మృతదేహానికి నివాళులర్పించారు. ములకలపల్లి మండలం చౌటిగూడెం గ్రామానికి చెందిన గిరిజన యువతి ఉకే శిరీష నర్సింగ్ పూర్తిచేసి హైదరాబాద్ శివారు తుక్కుగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. నర్సుగా పనిచేస్తున్న యువతిపై కన్నేసిన ఓ వ్యక్తి అర్ధరాత్రి ఆమె గదిలోకి చొరబడి లైంగిక దాడికి ప్రయత్నించగా ఆమె ప్రతిఘటించడంతో గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పహాడీషరీఫ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నివేదికతో పాటు ఇతర ఆధారాలను పరిశీలించిన పోలీసులు కేసును అత్యాచారం హత్య కేసుగా నమోదు చేశారు. శిరీష మృతితో ఆమె స్వగ్రామం చౌటిగూడెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మూడేళ్ల క్రితమే తండ్రి బ్రహ్మయ్య మృతి చెందడంతో తల్లి రామలక్ష్మి అన్న శివరాంతో కలిసి శిరీష జీవిస్తోంది. నర్సింగ్ పూర్తి చేసి కుటుంబానికి ఆసరాగా నిలుస్తుందనుకున్న శిరీష ఇలా దారుణ హత్యకు గురికావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు
