
జ్వాల వారధి న్యూస్ 31 ఆగస్టు 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జ్ జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్
జోగులాంబ గద్వాల్ జిల్లా అల్లంపూర్ నియోజకవర్గం రాజోలి మండలం చేనేత కార్మిక కళాకారులను ఆదుకునే ఉద్దేశంతో వారి అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని పట్టు చేనేత వస్త్రాలను ధరించాలి నేతన్నలను ఆదుకోవాలి నినాదంతో రాజోలి పి.డి అగర్వాల్ చేనేత షెడ్ ను జోగులాంబ గద్వాల జిల్లా అర్ డి ఓ శ్రీనివాస్ రావు సతీమణి చైతన్య మేడం మరియు ఐజ మండల యం అర్ ఓ జ్యోతి మేడం రాజోలి మండల కేంద్రానికి వచ్చి వీక్షించారు.ఇన్చార్జ్ నిషాక్ ఆధ్వర్యంలో చేనేత కార్మికుల స్థితిగతులు వారి కుటుంబ పరిస్థితులు చీరను ఎలా తయారు చేస్తారు వారి మార్కెటింగ్ కష్టనష్టాలు ఏ విధంగా ఉన్నాయి అనే కీలక విషయాలు తెలుసుకున్నారు.
అనంతరం తమకు నచ్చిన గద్వాల పట్టు చీరలను కొనుగోలు చేసి రాజోలి గ్రామంలో కూడా నాణ్యమైన గద్వాల పట్టు చీరలు తయారవుతున్నాయని మిత్రులకు బంధువులకు తెలియజేసి కొనుగోలు చేసేలా సహకరిస్తామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రాజోలి మండల అర్ ఐ చంద్రకాంత్, ఐజ మండల జి పి ఓ రాజోలి బజారి చేనేత కార్మిక కళాకారులు పాల్గొన్నారు.

