
జ్వాల వారిది న్యూస్ ఆగస్టు 26 అశ్వరావుపేట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఎం నాగేశ్వరరావు
రైతుల అనుభవం, ఉద్యాన పరిశోధన సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేటలో ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టిందని ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్త మజ్జిగ శ్రీనివాస్ వెల్లడించారు. కొత్త ఉద్యాన కళాశాలను ఈ విద్యా సంవత్సరం నుంచి 30 మంది విద్యార్థుల ప్రవేశ సామర్థ్యంతో ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, కళాశాల ఏర్పాటు ద్వారా స్థానిక విద్యార్థులకు ఉద్యాన విద్య అందుబాటులోకి రావడంతోపాటు, రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా శాస్త్రీయ పరిజ్ఞానం, సాంకేతిక నైపుణ్యం, క్షేత్రస్థాయి అనుభవం కలిగిన ఉద్యాన నిపుణులను తయారు చేసే అవకాశం ఏర్పడుతుందన్నారు. అశ్వారావుపేట ప్రాంతంలో విద్యార్థులు తరగతి గదిలో పొందిన శాస్త్రీయ పరిజ్ఞానాన్ని రైతుల తోటలు, పరిశోధనా ప్రయోగాలు, ప్రదర్శనా క్షేత్రాలు, నర్సరీలలో ప్రత్యక్షంగా పరిశీలించి అనుభవపూర్వకంగా నేర్చుకునే అవకాశం ఉంటుందని, కొత్త ఉద్యాన కళాశాల ఏర్పాటుతో పరిశోధన స్థానం వద్ద ఇప్పటికే అందుబాటులో ఉన్న శాస్త్రీయ మౌలిక వసతులు, ప్రయోగశాలలు, పండ్ల తోటలు, పరిశోధనా క్షేత్రాలు, ప్రదర్శనా విభాగాలు, శాస్త్రవేత్తల సేవలను విద్యార్థుల బోధన, పరిశోధనకు సమర్థవంతంగా వినియోగించుకునే అవకాశం ఏర్పడుతుందన్నారు. తద్వారా విద్యార్థులకు తరగతిగది బోధనతోపాటు ప్రత్యక్ష క్షేత్ర అనుభవం కూడా లభించి, నైపుణ్యం కలిగిన ఉద్యాన �
