దుక్కి దున్నుతుండగా ప్రమాదం
అదుపుతప్పి యువకుడిపైకి ట్రాక్టర్
పక్కటెముకలు, కాలుకు గాయాలు
జంగారెడ్డిగూడెంలో చికిత్స
అశ్వారావుపేట, ఆగస్టు 24 ( జ్వాలా వారిది న్యూస్ ) ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన ట్రాక్టర్ తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయ పనులు చేస్తుండగా ప్రమాదానికి గురై ఓ గిరిజన యువకుడు తీవ్రంగా గాయపడిన ఘటన అశ్వారావుపేట మండలంలో చోటుచేసుకున్నట్టు సమాచారం.
మండలంలోని కన్నాయిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని శివారు ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్‌లోని రాచన్నగూడెం గ్రామానికి చెందిన ట్రాక్టర్ యజమాని వ్యవసాయ పనుల కోసం ట్రాక్టర్‌తో దుక్కి దున్నినట్టు తెలిసింది. అనంతరం మొద్దు ఎక్కించే క్రమంలో ట్రాక్టర్ అదుపుతప్పడంతో ప్రమాదం జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు.
ఈ ఘటనలో గిరిజన యువకుడు ట్రాక్టర్ కింద పడటంతో తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. ప్రమాదంలో యువకుడి పక్కటెముకలు విరిగినట్టు, కాలుకు కూడా తీవ్ర గాయమైనట్టు తెలిసింది. వెంటనే ట్రాక్టర్ యజమాని గాయపడిన యువకుడిని జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు సమాచారం.
వ్యవసాయ పనులు చేస్తుండగా ఒక్కసారిగా ట్రాక్టర్ అదుపుతప్పి యువకుడిపై పడటంతో స్థానికంగా ఆందోళన నెలకొంది. ప్రమాదం ఎలా జరిగిందనే అంశంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గాయపడిన యువకుడికి మెరుగైన వైద్యం అందించాలని స్థానికులు కోరుతున్నాట్రాక్టర్ బీభత్సం.. గిరిజన యువకుడికి గాయాలు
దుక్కి దున్నుతుండగా ప్రమాదం
అదుపుతప్పి యువకుడిపైకి ట్రాక్టర్
పక్కటెముకలు, కాలుకు గాయాలు
జంగారెడ్డిగూడెంలో చికిత్స
అశ్వారావుపేట, ఆగస్టు 24 ( జ్వాలా వారిది న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్చార్జ్ ఎం నాగేశ్వరరావు ) ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన ట్రాక్టర్ తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయ పనులు చేస్తుండగా ప్రమాదానికి గురై ఓ గిరిజన యువకుడు తీవ్రంగా గాయపడిన ఘటన అశ్వారావుపేట మండలంలో చోటుచేసుకున్నట్టు సమాచారం.
మండలంలోని కన్నాయిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని శివారు ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్‌లోని రాచన్నగూడెం గ్రామానికి చెందిన ట్రాక్టర్ యజమాని వ్యవసాయ పనుల కోసం ట్రాక్టర్‌తో దుక్కి దున్నినట్టు తెలిసింది. అనంతరం మొద్దు ఎక్కించే క్రమంలో ట్రాక్టర్ అదుపుతప్పడంతో ప్రమాదం జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు.
ఈ ఘటనలో గిరిజన యువకుడు ట్రాక్టర్ కింద పడటంతో తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. ప్రమాదంలో యువకుడి పక్కటెముకలు విరిగినట్టు, కాలుకు కూడా తీవ్ర గాయమైనట్టు తెలిసింది. వెంటనే ట్రాక్టర్ యజమాని గాయపడిన యువకుడిని జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు సమాచారం.
వ్యవసాయ పనులు చేస్తుండగా ఒక్కసారిగా ట్రాక్టర్ అదుపుతప్పి యువకుడిపై పడటంతో స్థానికంగా ఆందోళన నెలకొంది. ప్రమాదం ఎలా జరిగిందనే అంశంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గాయపడిన యువకుడికి మెరుగైన వైద్యం అందించాలని స్థానికులు కోరుతున్నారు.
ప్రమాదంలో గాయపడిన గిరిజన యువకుడికి ఎలాంటి ప్రాణాపాయం లేకుండా త్వరగా కోలుకోవాలని గ్రామస్థులు ఆకాంక్షిస్తున్నారు.రు.
ప్రమాదంలో గాయపడిన గిరిజన యువకుడికి ఎలాంటి ప్రాణాపాయం లేకుండా త్వరగా కోలుకోవాలని గ్రామస్థులు ఆకాంక్షిస్తున్నారు.