
తక్షణమే ర్యాలంపాడు రిజర్వాయర్ నుంచి సాగునీటిని విడుదల చేయాలి కేటి దొడ్డి మండలం బిఆర్ఎస్ నాయకులు గాజుల కృష్ణ రెడ్డి డిమాండ్ జూరాల బ్యాక్ వాటర్ నెట్టెంపాడు/గుడ్డం దొడ్డి లిఫ్టు ద్వారా ర్యాలంపాడు రిజర్వాయర్ కు పంపింగ్ ను పెంచి కాలువలకు పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు ప్రస్తుతం ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టులో నీటిమట్టం 1,036.00 అడుగులు ఉంది కృష్ణ నది ఎగువన ఉన్న అలమట్టి జలాశయం ఫుల్ కెపాసిటీకి చేరువ ఉంది జూరాలకు నీళ్లు రాబోతున్నాయి అధికారులకు తెలిసిన
ప్రస్తుత స్టోరేజ్ నీళ్లు వదలక పోవడం ఏంటని ప్రశ్నించారు ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ అలసత్వంతో తెస్తున్న కరువు మండిపడ్డారు రైతుల ఆందోళన తీవ్రతరం కాకముందే అధికారులు,ప్రజాప్రతినిధులు స్పందించి ర్యాలంపాడు చివరి ఆయకట్టు గ్రామాలకు సాగునీరు విడుదల చేయాలని హెచ్చరిస్తున్నాం